అమెరికా విలవిల….
కరోనా విజృంభణతో యావత్ ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. కేసులు కోటికి చేరువవుతుండటం శాస్త్రవేత్తలను, ప్రభుత్వాలను కలవరపెడుతున్నది. బ్రెజిల్లో రోజువారీ కేసులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. భారత్లో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నది. రష్యా, బ్రిటన్లో కూడా కరోన కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో సగానికిపైగా కేసులు, 52 శాతానికి పైగా మరణాలకు ఈ ఐదు దేశాలే కేంద్రంగా ఉన్నాయి.
గత ఏప్రిల్ నెలకొన్న కొవిడ్ 19 భయానక పరిస్థితులు అమెరికాలో పునరావృతమవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 38,386 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో అక్టోబర్ 1 నాటికి కరోనా మరణాలు 1.80 లక్షలకు చేరుకోవచ్చని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అంచనా వేసింది. బ్రెజిల్లో గురువారం నాటికి 12,07,721 మంది వైరస్ బారిన పడ్డారు. 54,434 మంది మరణించారు. భారత్లో గడిచిన 24 గంటల్లో 16,922 కొత్త కేసులు, 418 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,73,105కు చేరుకున్నాయి. మొత్తం మరణాలు 14,894గా రికార్డు అయ్యాయి. 1,86,514 మంది చికిత్స పొందుతుండగా, 2,71,697 మంది (57.43 శాతం) కోలుకున్నారు.






