లక్షకు చేరువలో కరోనా కేసులు…
కరోనా మహమ్మారి ఉభయ తెలుగు రాష్ట్రాలను ఆందోళనలో పడేస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జెడ్ స్పీడ్ లో వైరస్ పాకుతున్నది.. ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొత్తం 99వేల 998 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. అలాగే 1118 మంది మరణించారు.. ఈ కేసులలో ఎపిలో 53వేల 724, తెలంగాణాలో 46వేల 274 పాజిటివ్స్ ఉన్నాయి.. అలాగే ఎపిలో ఇప్పటి వరకు 696 మంది మరణించగా, తెలంగాణాలో 422 మంది కన్నుమూశారు.. ఇక నిన్న ఎపి ప్రభుత్వం విడుదల చేసిన బులిటిన్ లో కొత్తగా 4,074 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 53,724 కేసులు నమోదయ్యాయి. ఇక, మరణాల సంఖ్య కూడా అదే రీతిలో పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 54 మంది మ•త్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో కరోనా మ•తుల సంఖ్య 696కి పెరిగింది. నిన్న 1,335 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 28,800 మంది చికిత్స పొందుతున్నారు.ఇక తెలంగాణా విషయానికి వస్తే సోమవారం కొత్తగా 1, 198 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఏడు మరణాలు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 46 వేల 274కి చేరాయి.






