కేసుల కల్లోలం… కరోనా ‘భారతం’
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న వేళ… కరోనా జాడలు పెద్దగా కనిపించని భారతదేశం ఇప్పుడు కరోనాకి నెలవుగా మారుతోన్నట్టు కనిపిస్తోంది. కేసులతో పాటు మరణాలు కూడా రోజు రోజుకూ పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తీరు ఆందోళన పెంచుతోంది. కేవలం నెలల వ్యవధిలోనే 500 నుంచి 5లక్షలకు చేరువైంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 4,90,401 పాజిటివ్ కేసులు నమోదవగా, 15,301 మంది మృతి చెందారు. వీటిలో దేశ వ్యాప్తంగా 1,89,463 యాక్టీవ్ కేసులు, 2,85,637 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏ రోజు కా రోజు రికార్డు సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్టే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 17,296 కేసులు నమోదయ్యాయి. వీరిలో 407 మంది మృతి చెందారు. మరోవైపు దేశంలో కరోనా రికవరీ రేటు కూడా పెరుగుతూ 58శాతానికి చేరింది. రాష్ట్రాల వారీగా చూస్తే…
– మహారాష్ట్రలో అత్యధికంగా 1,47,741 కేసులు,6931 మంది మృతి
– ఢిల్లీలో 73,780 కేసులు,2429 మంది మృతి
– తమిళనాడులో 70,977 కేసులు,911 మంది మృతి
– గుజరాత్ లో 29,520 కేసులు,1753 మంది మృతి
– ఉత్తరప్రదేశ్ లో 20,193 కేసులు,611 మంది మృతి
– రాజస్థాన్ లో 16,296 కేసులు,379 మంది మృతి
– పశ్చిమ బెంగాల్ లో 15,648 కేసులు,606 మంది మృతి
– మధ్యప్రదేశ్ లో 12,596 కేసులు,542 మంది మృతి
– హర్యానాలో 12,463 కేసులు,198 మంది మృతి
– తెలంగాణలో 11,364 కేసులు,230 మంది మృతి
– ఆంధ్రప్రదేశ్లో 10,884 కేసులు,136 మంది మృతి
– కర్ణాటకలో 10,560 కేసులు,170 మంది మృతి






