ఇంటెలిజెన్స్ చీఫ్స్ పై డొనాల్డ్ ట్రంప్ ఫైర్
అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్స్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. వీరి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్స్‌తో అత్యవసర సమావేశమైన ట్రంప్ మాట్లాడారు. మంగళవారం జరిగిన సెనెట్ కమిటీ సమావేశంలో ఇరాన్, ఉత్తరకొరియా దేశాల అంశం చర్చకు వచ్చింది. ఉత్తరకొరియా మరోసారి అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ కూడా మనపై కసితో ఉంది. ఆ దేశం న్యూక్లియర్ బాంబులు తయారీ చేయకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే, ఇరాన్‌పై మనం మోపిన ఆంక్షలతో ఆదేశం ఆర్థికాభివృద్ధి క్షీణించింది. అయినప్పటికీ, ఆదేశం అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఇరాన్ ప్రయోగిస్తున్న రాకెట్ లాంఛర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. మన భూభాగానికి దగ్గరగా రాకెట్ లాంఛర్లు వస్తున్నప్పటికీ వాటిని గుర్తించడంలో మన నిఘా వర్గాలు విఫలమయ్యాయి. ఉగ్ర సంస్థలను కట్టడి చేయడంలో ఇంటెలిజెన్స్ ఘోరంగా విఫలమైంది. మీరంతా మరోసారి స్కూల్స్‌కు వెళ్లండి. అంతా మేమే నిర్దేశించాలంటే ఇక మీరెందుకు అంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చవారు.













