అమెరికాకు లాభమంటేనే ఆ దేశంతో ఒప్పందం
చైనాతో ఫోన్ ద్వారా చర్చలు నడుస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దీంతో సంవత్సరం పాటు సాగిన వాణిజ్య యుద్దానికి తెరపడుతుంది. ఇటీవల జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా సమావేశమైన వీరిద్దరు ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో చర్చల పున:ప్రారంభంపై ట్రంప్ స్పందించారు. అయితే, ఆయన ఇక్కడ ఓ మెలిక పెట్టారు. ఈసారి చర్చలు కచ్చితంగా అమెరికాకు అనుకూలంగా ఉండాలని షరతు విధించారు. ఇంతకాలం ఉన్న వాణిజ్య ఒప్పందంతో చైనా భారీగా లబ్ది పొందిందని.. కావున ఈసారి 5050 డీల్‌కు అంగీకరించేది లేదన్నారు. అయితే చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.













