NATS: చికాగోలో నాట్స్ హైవే దత్తతలో తెలుగు విద్యార్ధులు
చికాగో: భావితరంలో సామాజిక బాధ్యత పెంచేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా చికాగోలో హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టి హైవేను శుభ్రం చేసింది. చికాగో నాట్స్ (Chicago NATS) విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో20 మందికి పైగా తెలుగు విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహాంగా పాల్గొన హైవేను శుభ్రం చేశారు. ఇలా తెలుగు విద్యార్ధులు నాట్స్ ద్వారా చేసిన ఈ సామాజిక సేవకు అమెరికా ప్రభుత్వం నుంచి వాలంటీర్ అవర్స్ కూడా లభిస్తాయి. ఇవి విద్యార్ధుల కాలేజీ ప్రవేశాలకు ఉపకరిస్తాయి. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ఈ నాట్స్ హైవే దత్తత కార్యక్రమంలో పాల్గొని విద్యార్ధులను ప్రోత్సాహించారు.
చికాగో చాప్టర్ కోఆర్డినేటర్లు నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, వీర తక్కెళ్ళపాటి తమ పక్కా ప్రణాళిక, సమర్థవంతమైన సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు, చికాగో చాప్టర్ నుంచి పాండు చెంగలశెట్టి,ఈశ్వర్ వడ్లమనాటి, శ్రీనివాస్ ఎక్కుర్తి, దివాకర్ ప్రతాపుల, గోపాల్లకు నాట్స్ ధన్యవాదాలు తెలిపింది.
ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కే బాలినేని, హరీష్ జమ్ముల, ఎమ్మాన్యుయేల్ నీలా, అలాగే మాజీ బోర్డ్ సభ్యులు మూర్తి కొప్పాక, శ్రీని అరిసాడ, శ్రీనివాస్ బొప్పన లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగు విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచే చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన చికాగో నాట్స్ నాయకులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.








