Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Usacitiesnews » Bayarea » Team aid meeting at california

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో టీం ఎయిడ్ అవగాహనా సదస్సు !

  • Published By: techteam
  • June 5, 2018 / 08:44 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Team Aid Meeting At California

ప్రవాసంలో నివసిస్తున్న భారతీయులకు అత్యవసర సమయాల్లో చేయూత ఇవ్వాలనే సంకల్పంతో ప్రారంభింపబడిన సంస్థ టీం ఎయిడ్ (Team Aid). లాభాపేక్షలేని ఈ సంస్థ పూర్తిగా స్వచ్ఛంద సేవకుల అంకితభావంతోనే నడుస్తున్నది. తమ సేవలను అమెరికాలోని 50 రాష్ట్రాల్లో  విస్తరింపజేయాలనే ప్రయత్నంలో కాలిఫోర్నియాలోని బే ఏరియాలో అవగాహనా సదస్సు నిర్వహించింది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ సభకు టీం ఎయిడ్ సంస్థ వ్యవస్థాపకుడు నన్నపనేని మోహన్, టీవీ9 ముఖ్య కార్య నిర్వహణాధికారి రవి ప్రకాష్, సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్, వైస్ చైర్మన్ కొండిపర్తి దిలీప్ తో బాటు సిలికాన్ వ్యాలీలోని ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 

Telugu Times Custom Ads

బే ఏరియాలోని వివిధ రాష్ట్రాల సంఘాలను సమన్వయపరిచి ఈ కార్యక్రమ నిర్వహణకు నాయకత్వం వహించిన సిలికానాంధ్ర వైస్ చెయిర్‌మెన్ దిలీప్ కొండిపర్తి మాట్లాడుతూ ఎంతటి వివేకవంతులైనను ఆపద సమయాల్లో అయోమయంతో ఏం చెయ్యాలో పాలుపోని  పరిస్థితులో పడతారని, అలాంటివాళ్ళను ఆదుకోవలసిన అవసరం తోటి ప్రవాసుల నైతిక బాధ్యత అని,ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కన్నా వేరే సేవ ఉండదని, టీం ఎయిడ్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి సిలికానాంధ్ర తమ జగమంత కుటుంబంతో ఎల్లప్పుడూ సహకరిస్తుందని అన్నారు. 

నన్నపనేని మోహన్ టీం ఎయిడ్ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ కొన్ని ఉదాహరణలను కూడా పేర్కొన్నారు. బంగారు భవిష్యత్తును ఆశిస్తూ స్వదేశాన్ని విడిచి వచ్చిన వారికి ఏలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినను భుజం తట్టి సహాయం చేయాలనే సదుద్దేశంతో టీం ఎయిడ్ ప్రారంభింపబడిందని తెలిపారు. టీం ఎయిడ్, ఏ ఇతర కమ్యూనిటీ సంస్థలకు పోటీ కాదని, అమెరికా పోలిసులతో బాటు, విదేశాంగ ప్రతినిధులతో, భారతదేశంలోని అధికారులతో కలిసి పనిచేస్తుందని చెప్పారు.

అమెరికాలోని భారతీయ సంస్థలన్నిటినీ కలుపుకుంటూ, ఒక కేంద్రీయ సహాయ కేంద్రంగా పనిచెస్తుందని తెలిపారు. ఆపద సమయాల్లో సమయం వృధా కాకుడదని, ఎంత త్వరగా మేలుచేస్తే అంతటి ఊరట కలుగుతుందని చెప్పారు.

టీవీ 9 సీయీఓ రవి ప్రకాష్ మాట్లాడుతూ తాను స్వయంగా నన్నపనేని మోహన్ కార్యదీక్షతను చూసి అబ్బురపోయానని అన్నారు. ప్రవాస  భారతీయ సంఘాలన్నీ కుల మత భాష జాతి వివక్ష లేకుండా టీం ఎయిడ్  తో కలిసి పనిచేస్తే బాగుంటుందని ఆశించారు. కార్యక్రమంలో సిలికానాంధ్ర సన్స్థాపక అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, సీ ఈ ఓ రాజు చమర్తి, సీ ఎఫ్ ఓ దీనబాబు కొండుభట్ల ఇతర సభ్యులు పాల్గొన్నారు.

శ్రీ రాజ్ భనోత్ (హిందూ టెంపుల్ అంద్ కమ్యునిటీ సెంటర్ (సన్నివేల్)), నీరజ్ భాటియా (ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) తో పాటు బే ఏరియాలోని Bay Area Tamil Mandram, Manca (Malyali Assn), Bay Malyali Assn, MAITRI (Malayali), Sunnyvale Hindu Temple, Spectrum Church, San Jose Gurudwara, Bay Area Phabhasi (Bengali Assn), UPMA (Utter Pradesh), Maharastra Mandal, Indo-American Chamber of Commerce, Orissa Assn, Bubhaneshwar Sister Cities of Cupertino, Kashmiri Assn, Indian Muslim Relief and Charities (IMRC), Punjab Foundation, Sewa Internaltional, APPAPA, Rana ( Rajastan Assn ), Sindhi Assn, Akali Dal (Punjabi) సంఘాల ప్రతినిధులు సభకు హాజరయ్యి తమ సంఘీభావాన్ని తెలుపుతూ టీం ఎయిడ్ తో కలిసి పనిచెయ్యడం ముదావహమని చెబుతూ ఆ సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామ్యం అవుతామని, టీం ఎయిడ్ ప్రయోజనాలని వారివారి సంస్థ/సంఘ సభ్యులందరికీ చేరవేస్తామని, టీం ఎయిడ్ కు విస్తృత ప్రచారం కల్పించి అవసరమైన వారికి సాయం అందేలా సహకరిస్తామని అన్నారు.   

Click here for Event Gallery

 

Tags
  • Baya Area
  • california
  • Nannapaneni Mohan
  • SiliconAndhra
  • TEAM AID

Related News

  • Ata Cricket Tournament In Chicago

    ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయవంతం

  • Distribution Of Nats Ganesh Maha Prasadam In Philadelphia

    NATS: నాట్స్ గణేశ్ మహా ప్రసాదం పంపిణీ

  • Siliconandhra Creates Another Sensation New Executive Committee With Women

    SiliconAndhra: సిలికానాంధ్ర మరో సంచలనం… మహిళలతో నూతన కార్యవర్గం

  • Dasharathi Centenary Celebrations By Ata

    ATA: ఆటా ఆధ్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవాలు

  • Dallas Dasara Alai Balai Celebrations

    Dallas Dasara: డల్లాస్ దసరా అలయ్ బలయ్ వేడుకలకు ముహూర్తం ఫిక్స్

  • Gwtcs Tana Annual Picnic At Lake Fairfax Park

    Annual Picnic: జీడబ్ల్యూటీసీఎస్, తానా వార్షిక పిక్నిక్‌కు రెడీ

Latest News
  • ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయవంతం
  • Kishkindhapuri Review: భయపెట్టిన ‘కిష్కిందపురి’
  • Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’
  • YS Jagan: జగన్‌పై ఎమ్మెల్యేల అసంతృప్తి..!?
  • Samantha: రిస్క్ తీసుకుంటేనే స‌క్సెస్ వ‌స్తుంది
  • Anupama Parameswaran: అనుప‌మ ఆశ‌లు ఫ‌లించేనా?
  • Jeethu Joseph: దృశ్యం 3 పై అంచ‌నాలు పెట్టుకోవ‌ద్దు
  • Ilayaraja: అమ్మవారికి రూ.4 కోట్ల వ‌జ్రాల కిరీటాన్ని ఇచ్చిన ఇళ‌యరాజా
  • Pawan Kalyan: ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
  • Ganta Srinivasa Rao: జగన్ పై గంటా శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer