టాటా అన్నదానం
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని కీసర దగ్గర వలస కార్మికులకు టాటా ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. టాటా వ్యవస్థాపక చైర్మన్ డా. పైళ్ళ మల్లారెడ్డి ఆశీస్సులతో, టాటా ఎగ్జిక్యూటివ్, ఇతర కమిటీ నాయకుల సహకారంతో టాటా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ మానాప్రగడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 500 మందికి భోజనం పెట్టారు. తెలంగాణ పోలీసుల సూచనలతో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ మానాప్రగడ తెలిపారు. శ్రీనివాస్ మానాప్రగడ స్నేహితులు రామ్ ప్రసాద్, నవీన్, రాజేశ్ సింగ్, ఆరోగ్య రాజు తదితరులు ఈ?కార్యక్రమాన్ని నిర్వహించారు. మదర్స్ డేను సందర్భంగా చేసిన ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చిందని నిర్వాహకులు తెలిపారు.






