తెలుగు విద్యార్థుల కోసం ‘తానా స్టెమ్ మిషన్’
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు స్టెమ్ ఫ్లైట్స్ సహకారంతో అమెరికాలో 11 – 18 సంవత్సరము గల తెలుగు పిల్లల కోసం ‘తానా స్టెమ్ మిషన్’ అనే పోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. ఇది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితం వంటి సబ్జెక్ట్‌లలో బాగా శిక్షణ పొందడం కోసం ఏర్పాటు చేశారు. స్టెమ్కెరీర్లను కొనసాగించడానికి తెలుగు యువతలో స్ఫూర్తిని నింపేందుకు దీనిని నిర్వహించారు. భవిష్యత్తు తరాల కోసం గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తానా సభ్యులకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ధన్యవాదులు తెలియజేశారు. రేపటి యువత కోసం ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను అందుబాటులోకి తేవాలని కోరారు.













