రావు యలమంచిలి ఆధ్వర్యంలో విండ్సర్ ఫుడ్ బ్యాంక్ కు తానా సహాయం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఫుడ్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా విండ్సర్‌లో ఉన్న విండ్సర్ ఫుడ్ అండ్ ప్యూయల్ బ్యాంక్‌కు ఆహారపదార్థాలను అందించింది. 1200 డాలర్లు విలువ చేసే ఆహార పదార్థాలను ఫుడ్బ్యాంక్కు అందించినట్లు తానా నాయకుడు రావు యలమంచిలి తెలిపారు. వేణు అనుమోలు, వినిల్ దేవభక్తుని, వంశీ చింతపల్లి, కుమార్, పల్రెడ్డి, శ్రీనివాసరావు సుఖవాసి, వివేక్ కొమరిన, విజయ్ నాగవరపు, తమ్మ రవీంద్ర, కమల్, స్వామిదాస్, శ్రీకాంత్ నెలకుడిటి, ఘంటా రామ్ టాగూర్, అడప సత్యనారాయణ, విక్రాంత్ సూర్యదేవర, రామ్ కోయడ ఇతర దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హరికృష్ణ యలమంచిలి, విశ్వనాథ్ నాయునిపాటి, వంశీ వాసిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆహారపదార్థాలను ఫుడ్ బ్యాంక్‌కు అందించారు. తానా అందించిన ఈ సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ విండ్సర్ ఫుడ్ అండ్ ప్యూయల్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎర్నెస్ట్ పెరాల్ట్ ఓ లేఖను రాశారు. రావు యలమంచిలికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలను ఫుడ్ బ్యాంక్ తెలియజేసింది.













