NRI TDP అమెరికా కార్యకర్తల ఆధ్వర్యంలో “సైలెంట్ ప్రొటెస్ట్”
ఉత్తర అమెరికా – ఏపీ డిమాండ్స్ జస్టిస్ “సైలెంట్ ప్రొటెస్ట్”
ఖండాంతరాల్లో ఉన్నా, కన్న తల్లి మీద మమకారం పోలేదు. అమెరికా ప్రవాసాంధ్రులు “ఏపీ డిమాండ్స్ జస్టిస్” అనే నినాదంతో విభజిత ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మార్చి 3వ తారీకున ఉత్తర అమెరికాలోని హ్యూస్టన్, చార్లెట్, సీయాటిల్, అల్బానీ, బేఏరీయ, అట్లాంటా, పోర్ట్లాండ్, డల్లాస్, ఆస్టిన్, స్యేంట్ లూఇస్, కొలంబస్, ఒమాహా, ఫిలడెల్ఫియా, కాన్సాస్ సిటి మరియు లాస్ ఏంజెలెస్ నగరాల్లో నిరసన ప్రకటిస్తూ మౌనం వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాభివృద్ది కోసం అహర్శిశలూ కష్టపడుతున్నారు. దానికి సంఘీభావంగా ఈ రోజు ఏన్.ఆర్.ఐ – టీ.డీ.పీ అమెరికా కార్యకర్తల ఆధ్వర్యంలో దాదాపుగా 20 నగరాల్లో ఈ “సైలెంట్ ప్రొటెస్ట్” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినది.
ఈ కార్యక్రమంలో పిల్లలు మరియు పెద్దలు ఉత్సాహంగ అందరు పాల్గొన్నరు. విభజన సమయంలో ప్రకటించిన నిధుల మరియు హామీల మంజూరు ఆంధ్రుల హక్కు అని తెలుగు వాడి ఘోష ఢిల్లీ చేరడానికి తమ వంతు చేయాలనే తపనతో పై నగరాల్లో ప్రశాంతంగా నిరసన తెలిపారు. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం మనకిరావలిసిన మరియు మనకి చేస్తాము అని చెప్పినవి సాదించుకోవటమే అని కార్యక్రమంలో పాల్గొన్న అందరూ వ్యక్త పరచటం జరిగింది.













