యూఎస్ ఓపెన్ కు సెరెనా సిద్ధం
ఆరు నెలల విరామం తర్వాత అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మళ్లీ కోర్టులోకి రాబోతోంది. నేటి నుంచి ఆరంభమయ్యే టాప్ సీడ్ ఓపెన్‌లో ఆమె బరిలో దిగబోతోంది. చివరిగా ఫిబ్రవరిలో జరిగిన ఫెడ్ కప్‌లో ఆడిన 38 ఏళ్ల సెరెనా.. ఇటీవలే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. కరోనా వచ్చిన తర్వాత తొలిసారి అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నిలో సెరెనాతో పాటు ఆమె సోదరి వీనస్, విక్టోరియా అజరెంకా, స్టీఫెన్స్, కొకో గాఫ్ లాంటి స్టార్లు పాల్గొంటున్నారు. ఈ నెల 31న ప్రారంభమయ్యే యుఎస్ ఓపెన్‌కు ఈ ఛాంపియన్‌షిప్‌ను సన్నాహక టోర్నీగా నిర్వహిస్తున్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్న సెరెనా.. ఈ టోర్నీలో బరిలో దిగడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. నా బృందం అంతా ఒక బుడగలోనే ఉంటుంది. ఆరోగ్యానికే ప్రధానంగా ప్రాముఖ్యత ఇస్తున్నా అని సెరెనా చెప్పింది.













