కరోనా మహమ్మారిని జయించిన అమెరికన్ నటుడు

అమెరికన్ నటుడు టామ్ హ్యాంక్స్, అతని భార్య రిటా విల్సన్ కరోనా మహమ్మారిని జయించారు. మార్చి నెలలో ఈ జంటకు కరోనా పాజిటివ్ అని తేలడంత ఆస్ట్రేలియా లోని ఓ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించారు. కరోనా నెగటివ్ రిపోర్ట్ వచ్చాక కూడా వీరిద్దరూ కొంతకాలం పాటు క్వారంటైన్‍లో ఉన్నారు. కరోనా సోకిన సమయంలో తనుపడ్డ ఇబ్బందులను మీడియాతో పంచుకున్నారు. కరోనా వైరస్ సోకిన సమయంలో మాకు తీవ్రమైన ఒళ్లు నొప్పులు ఉండేవి. తల తిరిగిపోయేది. నీరసంతో అసహనంగా, అసౌకర్యంగా అనిపించేది. తర్వాత విపరీతమైన జ్వరంతో బాధపడ్డా. తట్టుకోలేనంత చలిగా అనిపించేది. వాసన, రుచి ఏమీ తెలిసేది కాదు. కరోనా పాజిటివ్ నిర్ధారణ ఆయ్యాక కూడా 9 రోజుల పాటు నాకు 102 డిగ్రీల జ్వరం ఉంది. క్లోరోక్వీన్ మెడిసిన్ వాడిన తర్వాత నా జ్వరం తగ్గింది. మెడిసిన్ తీసుకున్న సమయంలో విపరీతమైన చెమటలతో ఒళ్లంతా తడిచి ముద్దయ్యేది. అయితే నాలో కనిపించినంతగా నా భర్తలో కరోనా లక్షణాలు కనిపించలేదు. ఆయనకు జ్వరం కూడా రాలేదు. రుచి, వాసనను మాత్రం గ్రహించగలిగేవారు. ఈ వైరస్‍తో మే నరకం చూశాం. ఇప్పుడు కోలుకుని ఇంట్లో ఉన్నాం అని రిటా చెప్పారు.