వర్జీనియాలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు
ప్రముఖుల హాజరు…ఆటల పోటీలు, శ్రీనివాస కళ్యాణం విజయవంతం
యుగ పురుషుడు విశ్వ విఖ్యాత నవరస నటనా సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డా .శ్రీనందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలను అమెరికాలో వివిధ నగరాల్లో ఘనంగా నిర్వహించారు. వర్జీనియాలో శ్రీనివాస్ ఉయ్యూరు ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పలువురు ప్రముఖులు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగుజాతి పౌరుషాన్ని విశ్వవిఖ్యాతం చేసిన కీర్తి ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. తెలుగువాళ్ళ రాజకీయ సత్తాను ప్రపంచానికి చాటిన మహానుభావుడు ఎన్టీఆర్ అంటూ, నటనలో ఆయనకు సాటి మరొకరు లేరన్నారు. తెలుగు భాషను అభివృద్ధి చేయడంలో ఎన్టీఆర్ చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మన్నవ సుబ్బారావు, ఎలిమినేటి సందీప్ రెడ్డి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, గుమ్మడి గోపాలకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఎన్టీఆర్ అభిమానులు, శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు కలిసి నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులంతా ఇందులో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలను అందుకున్నారు. రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. పలు ఆటల పోటీలను కూడా నిర్వాహకులు నిర్వహించారు. ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్, క్యారమ్ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ శతజయంతి వేడుకల్లో ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్ ట్రైనింగ్‌ను కూడా ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, తానా కార్యదర్శి సతీష్ వేమూరి, తానా ట్రెజరర్ అశోక్‌బాబు కొల్లా, బోర్డ్ డైరెక్టర్ జాని నిమ్మలపూడి, తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గూడె, టాగూర్ మలినేని తదితరులు పాల్గొన్నారు. గెస్ట్లుగా వైవిఎస్ చౌదరి, మూల్పూరి వెంకట్రావు తదితరులు వచ్చారు.













