ఇద్దరు నేతల భేటీ ఇంకా ఖరారు కాలేదు : వైట్ హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌తో భేటీకి తేదీ ఇంకా ఖరారు కాలేదని అమెరికా అధ్య్ష భవనం వెల్లడించింది. వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ మీడియాతో మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతాయని తెలిపారు. ఇరు దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు విధి విధానాలను తాము రూపొందించలేదని, చైనాతో చర్చలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఇద్దరు నేతల భేటీకి సంబంధించి తుది నిర్ణయం తీసుకున్న వెంటనే తాను మీడియాకు తెలియజేస్తానన్నారు. జిన్‌పింగ్‌తో భేటీపై అనిశ్చితికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్‌పై విశ్వాసం లేక ట్రంప్ హనోయ్, సమావేశం నుండి నిష్క్రమించారని చైనా పేర్కొనడమే కారణమా అని విలేకరులు అడగ్గా, అలాంటిదేమీ లేదని ఆమె తెలిపారు. దేశానికి ప్రయోజనకరమైన ఒప్పందం కుదిరే పక్షంలో ఒప్పందం కుదుర్చుకునేందుకు అధ్యక్షుడు సిద్ధంగా వున్నారని ఆమె చెప్పారు. ఉత్తర కొరియాతో చర్చల్లో ఏ విధంగా వ్యవహరించామో చైనాతో జరిగే చర్చల్లో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నామని అన్నారు.













