ఫ్రెండ్లీ హౌస్‌కి నాట్స్ బోస్టన్ విభాగం విరాళం
అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంతో సాయం
అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో అక్కడ నిరుపేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తన వంతు సాయం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ బోస్టన్ విభాగం స్థానికంగా పేద కుటుంబాల ఆకలి తీర్చే ఫ్రెండ్లీ హౌస్‌కు 1500 డాలర్లను విరాళంగా అందించింది. నాట్స్ బోస్టన్ చాప్టర్ సమన్వయకర్త శ్రీనివాస్ గొండి ఆధ్వర్యంలో 1500 డాలర్ల చెక్కును ఫ్రెండ్లీ హౌస్‌కు ఇవ్వడం జరిగింది. నాట్స్ ఇచ్చిన విరాళంతో ప్రస్తుతం 150 కుటుంబాలకు తాము సాయం చేయవచ్చని ఫ్రెండ్లీ హౌస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోర్డాన్ హార్గోవ్ తెలిపారు.
బోస్టన్‌లో ఇలా సాయం అందించేందుకు ముందుకొచ్చిన తొలి భారతీయ సంస్థ నాట్సేననని ఆయన అన్నారు. మానవతా దృక్పథంతో విరాళమిచ్చిన నాట్స్ సభ్యులను ఆయన ప్రశంసించారు.













