జనసేన హ్యూస్టన్ సంఘీభావం మరియు సైలెంట్ ప్రొటెస్ట్
హ్యూస్టన్ మహానగరంలో “రే మిల్లర్ పార్కులో – (రవింద్ర నాధ్ టాగూర్ పార్క్)” జనసేన కార్యకర్తలు రాజేష్ యాళ్ళబండి ఆద్వర్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి తమ సంఘీభావం తెలుపుతూ, మీడియా అరాచకాలను ఖండిస్తూ “సైలెంట్ ప్రొటెస్ట్” చేసారు.
ఈ కార్యక్రమానికి జనసెన నాయకులు మరియు సోషల్ మీడియా ఏక్టీవ్ కాంట్రిబ్యూటర్ “శ్రీ విష్ణు నాగిరెడ్డి గారు” ( సాన్ అంటోనియో నగరం ) ముఖ్య అతిధిగా విచ్చేసారు.
విష్ణు నాగిరెడ్డి ప్రతీ కార్యకర్తా మీడియా అఘాయిత్యాలని ఖండిస్తూ, యల్లో మీడియాని “బోయ్ కాట్” చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు మరింత బాధ్యతతో జనసేన సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని విజ్ఞప్తిచేసారు. పవణ్ కళ్యాణ్ గారి సహకారంతో నాలుగేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం, అదే పవణ్ కళ్యాన్ గారిని రాజకీయంగా, మానసికంగా మరియు కుటుంబ పరంగా ప్రభుత్వ పెంపుడు యల్లో మీడియాతో ఎన్నిరకాలుగా ఇబ్బందులకుగురిచేస్తున్నారో విశధీకరించారు. లక్షలాది తమ ఫేస్ బుక్, యూట్యూబ్ ఫాలోయర్లకు వ్యూయర్లకూ ఈ ఆగడాల యల్లో మీడియాని బహిష్కరించవలసిందిగా, ఏ విదంగా “బ్లాక్ / అన్-ఫాలో” కావాలో వివరించారు.
వెంకట్ శీలం మాట్లాడుతూ, నవసమాజ నిర్మాణంలో ముఖ్య భూమికవహించవలసిన మీడియా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందన్నారు. మీడియా తీరుమారవలసిన సమయమాసన్నమైందన్నారు.
కృష్ణ చిరుమామిళ్ళ మాట్లాడుతూ, మీడియా తప్పుడు ప్రచారాలతో, అభూత కల్పనలతో ప్రజలని మరియూ రాజకీయాలని గణనీయంగా ప్రభావితంచేస్తున్నారన్నారు. పవన్ అభిమానులు మరియు జనసేన కార్యకర్తలూ ఈ మీడియా విషయంలో “తగు జాగ్రత్తా” అని ఉద్ఘటించారు.
పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పైపైకి అని శ్రీ శ్రీ గారి స్పూర్తిని శశి లింగినేని గారు మరోసారి జనసేన కార్యకర్తలను ఉత్తేజపరిచారు. నవసమాజం కోసం ప్రస్తుత మీడియాలో మార్పు అవసరమన్నారు.
వీరా కంబాల మాట్లాడుతూ మెరుగైన సమాజం, మీడియా కోసం నీతీ, నిబద్ధత, నిజాయితీలతో పనన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారని, వారికి NRIలందరూ సహకరిస్తారని తెలిపారు.
రాజేష్ యాళ్ళబండి మాట్లాడుతూ ప్రతీ కార్యకర్తా జనసేన సిద్ధాంతాలను, స్పెషల్ స్టేటస్ ఆవశ్యకత, పల్లెపల్లేకీ, ప్రతీ పౌరుడికీ చేర్చాలని కోరారు. ప్రతీ కార్యకర్తా భాద్యతగా ఈ కుళ్ళు రాజకీయాలని తిప్పికొట్టాలని, “స్వచ్చ మీడియా” కొరకై ప్రస్తుత “బ్రష్టు మీడియాని” అవసరమైతే Ban చేయాలని కోరారు. “Paid & Sold మీడియాలతో” రాష్ట్ర ప్రజలు అశాంతి మరియు అసౌకర్యాలకు గురీవుతున్నారన్నారు మరియు రాష్ట్ర అభివృద్ది కుంటుపడుతుందన్నారు. రాష్ట్ర భవ్యషత్తు కోసం జనసేన అధికారంలోకి రావాలని, అందుకోసం NRI లందరూ #NowOrNever రీతిలో కృషిచేస్తారని తెలిపారు
శేషాద్రి మంచం మాట్లాడుతూ ప్రస్తుత కలుషిత మీడియా ప్రధాన సమస్యలను ప్రక్కతోవ పట్టించడంలో సఫలీకృతమౌతుందన్నారు. అట్టి చానళ్ళని బేన్ చేయవలసినదిగా జనసేన కార్యకర్తలను కోరారు.
దుర్గారావ్ నుప్పులేటి మాట్లాడుతూ ఒక శికండి, ఒక శకునిలతో ఈ మీడియా మరియు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని పద్మవ్యూహంలోకి లాగుతుందని, ఆయన అభిమన్యుడిలా కాక అర్జునుడిలా ఈ మీడియా విషభంధాలని చేదిస్తారని ఉద్ఘటించారు.
చైతన్య కూచిపూడి మాట్లాడుతూ గత మూడు ధశాబ్దాలుగా బ్రష్టు పట్టిన మీడియా చేష్టలకు వ్యతిరేకంగా ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతున్నామన్నారు.
సురేష్ సత్తి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి జరిగిన ఘోరమైన పరాభవాన్ని ఖండిస్తూ, అభిమానులు, కార్యకర్తలూ సంయమానంగా ఉండాలని కోరారు.
రాం సింహాద్రి మాట్లాడుతూ జనసేనపైన, పవణ్ కళ్యాన్ మరియు వారి అభిమానులపై మీడియా గురిచేస్తున్న ఇబ్బందులను ఖండించారు.
సుబ్రమణ్యం వంగల గారు మాట్లాడుతూ మీడియా ఇబ్బందికరమైన చర్యలను కట్టిపెట్టి, ప్రజాయోపమైన చర్యలు చేపాట్టాలన్నారు.
నాగ్ మేకల మాట్లాడుతూ జర్నలిజం విలువలు తుంగలోకి తొక్కి, ఏ మచ్చాలేని నాయకుడిపై కుటుంభపరమైన దాడులుచేస్తూ మానసిక క్షోబకు గురిచేస్తున్న ఈ ప్రస్తుత యల్లో మీడియా మరియు ప్రభుత్వాలకు అతి త్వరలో సరైన గుణపాఠం వస్తుందన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ రోజు కుటుంభమంతా కలసి న్యూస్ చానల్ చూడలేని స్థితికి తెలుగు మీడియా దిగజారిందన్నారు. దీనికి కారణమైన పెద్దమనుష్యులలోనూ, చట్టాలలోనూ మార్పు తీసుకురావలసిన సమయమాసన్నమైందన్నారు
ఈ సంధర్భంగా ఎన్. ఆర్. ఐ లందరూ, జనసేన పార్టీ నిర్మానానికి బలోపేతానికీ తమ పూర్తి సహాయసహకారలు అందిస్తామని “విశ్వకవి రవింద్ర నాధ్ టాగూర్ సాక్షిగా” ప్రతీజ్ణపూనారు. ఆంధ్ర ప్రదేష్ రాజకీయాల్లోను, తెలుగు జర్నలిజం లోనూ ఆశాజనకమైన మార్పులు ఆశిస్తూ “రవింద్ర నాధ్ టాగూర్” విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
#NowOrNever, #withPK మరియు జై జనసేన నినాధాలతో రే మిల్లర్ పార్కు మరియు పరిశరప్రాంతాలు దద్ధరిల్లాయి.
ఈ కార్యక్రమానికి జగన్ రాయవరపు, శేషగిరి రావు యల్లాప్రగడ, కిరణ్ వర్రే, శశి లింగినేని, సందీప్ రామినేని, రాం సింహాద్రి, కిషోర్ అధికారి, రమేష్ వరంగంటి, వెంకట్ బోనం, సుబ్రమణ్యం వంగల, వెంకట్ శీలం, వీరా కంబాల, దుర్గారావ్ నుప్పులేటి, శేషద్రి మంచెం, నాగ్ మేకల, సురెష్ సత్తి, చైతన్య కూచిపూడి, మహేష్ ముద్దాల, కృష్ణ చిరుమామిళ్ళ, రాజేష్ యాళ్ళబండి, “సాన్ అంటోనియో నగరం నించి విష్ణు నాగిరెడ్డి మరియు శ్రీకాంత్” మరియూ హ్యూస్టన్ పరిశర ప్రాంత జనసేన కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు హాజరయ్యారు.













