మిల్పిటాస్లో జరిగిన యోగా డే లో సుజనా చౌదరి
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని భారత్‌తో సహా ఇతర దేశాల్లో ఘనంగా నిర్వహించారు. అమెరికాలో కూడా యోగా డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. మిల్పిటాస్లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్లో జరిగిన యోగా కార్యక్రమంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీశాఖ మంత్రి సుజనాచౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత అంబాసిడర్ వెంకటేశన్ అశోక్ కూడా పాల్గొన్నారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి, యోగా భారతి (యుఎస్ఎ) ఈ?కార్యక్రమానికి పార్టనర్లుగా వ్యవహరించాయి. వర్కింగ్ డే అయినప్పటికీ చాలామంది ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం?విశేషం. ఈ?సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ, యోగా ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని చెప్పారు. సూర్యనమస్కారాలు, ప్రాణాయామాలు ఆరోగ్యంతోపాటు ఉత్సాహాన్ని శక్తిని పెంపొందిస్తాయని చెప్పారు. మానసికవికాసానికి కూడా యోగా దోహదపడుతుందని చెప్పారు. ఈ?కార్యక్రమంలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు సుజనా చౌదరి మిల్పిటాస్లో ఉన్న స్వాగత్ రెస్టారెంట్‌కు, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయనకు ఘనస్వాగతం లభించింది.













