న్యూయార్క్ కోర్టు జడ్జిగా భారతీయుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్క్‌లోని అమెరికా తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన సంకేత్ జయేశ్ బల్సారా(46)ను నియమించినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. బల్సారా ఇదే కోర్టు మేజిస్ట్రేటుగా 2017 నుంచి పనిచేస్తున్నారు. ఆ పదవిని చేపట్టిన మొట్టమొదటి దక్షిణాసియా సంతతి వ్యక్తి ఆయనే. ఇప్పుడు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. భారత్, కెన్యాల నుంచి 50 ఏళ్ల క్రితం వలస వచ్చిన దంపతుల కుమారుడే బల్సారా. ఈయన సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా, నియంత్రణ వ్యవహారాల్లో నిపుణుడు. బల్సారా తండ్రి న్యూయార్క్ నగర పాలిక ఇంజినీరుగా పనిచేయగా, తల్లి నర్సు.







