ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం
దేశీయ అతి పెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండేళ్లలో అమెరికాలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోనుంది. అమెరికా ప్రభుత్వం అనుసరిస్త్ను హెచ్1బీ వీసాలపై కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండేళ్లలో 10వేల మంది అమెరికన్లను ఉద్యోగులుగా నియమించుకోనున్నట్లు ప్రకటించింది. అంతేగాక, అమెరికాలో నాలుగు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఉద్యోగుల నుంచి వీసా సంబంధిత సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. ఈ నియామకాలతో పాటు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ అండ్ బిగ్ డేటాపై కూడా ఇన్ఫోసిస్ దృష్టి పెట్టనుంది.













