MARY LAND: అమెరికాపై ఫ్లయింగ్ సాసర్స్ రెక్కీ…? ఆందోళనలో మేరీల్యాండ్ పరిసర ప్రజలు..
ఫ్లయింగ్ సాసర్స్.. యూఎఫ్ఓ(UFO) పేరేదైనా సరే అమెరికన్లకు బాగా సుపరిచితం. హాలీవుడ్ సినిమాల్లో దశాబ్దాల క్రితమే ఈ యూఎఫ్ఓ గురించి అనేక కోణాల్లో సినిమాలు కూడా తీశారు. దీంతో ఇవి ఉన్నాయని కొందరు. లేవని అంతా కల్పితమని మరికొందరు చెబుతూ వస్తున్నారు. అయితే అమెరికాలో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం తాము యూఎఫ్ఓ(UFO) లను చూశామని బల్లగుద్దీ మరి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు వారందరి వాదనలకు బలమైన ఆధారం లభించినట్లైంది.
న్యూజెర్సీ(Newjersey), మేరిల్యాండ్(mary land) పరిసరాల్లో ఏకంగా సిటీ సమీపంలోనే యూఎఫ్ఓల సంచారం కనిపించింది. అయితే వీటిని తొలుత చూసిన కొందరు స్థానికులు… తొలుత స్టార్స్ దగ్గరగా వచ్చాయనుకున్నారు. తర్వాత కాదు.. చిన్న విమానాలు, డ్రోన్స్ గా అభిప్రాయపడ్డారు. కానీ మరికొందరు కాస్త ఆసక్తిగా వాటిని తిలకించారు. అప్పుడే అవి డ్రోన్స్ కాదు.. యూఎఫ్ఓ అని అనుమానించారు. మరికొందరైతే .. తాము చెబితే నమ్మరు కాబట్టి.. వాటిని సెల్ ఫోన్లలో చిత్రీకరించారు కూడా., దీన్ని కొందరు సోషల్ మీడియాలోనూ పోస్టు చేశారు.
ఇవి గ్రీన్, రెడ్ కలర్స్ చేంజ్ చేస్తూ ఎగురుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది, పదిహేను యూఎఫ్ఓలను తాము చూసినట్లు స్థానికులు చెబుతున్నారు. అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి. వాటి ఉద్దేశ్యమేంటి..?ఇవి నిజంగానే యూఎఫ్ఓలా..? లేదంటే శత్రుదేశాల డ్రోన్లు ఎగురుకుంటూ వచ్చాయా… లేదా ఏదైనా డ్రోన్ కంపెనీవీటిని పరీక్షించిందా.. అన్న అనుమానాలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. మరి అగ్రరాజ్యం, అందునా రక్షణరంగంలో అభేద్యమైన అమెరికాలో సెక్యూరిటీ కళ్లు గప్పి … ఇవి అక్కడివరకూ ఎలా వచ్చాయి. ? అందులోనూ అత్యంత కీలకమైన రూట్ 50 కారిడార్(Route 50 Corridor) దగ్గరే ఎందుకు కనిపించాయి..?
లోకల్ పీపుల్ నుంచి యూఎఫ్ఓలను చూసినట్లు ఫిర్యాదులొచ్చాయని పోలీసులు చెబుతున్నారు. అయితే వాటికి సంబందించిన ఆధారాలు లేవన్నారు.అయితే మేరీలాండ్ మాజీగవర్నర్ లారీహోగన్స్.. మాత్రం ఈ వ్యవహారం అంత తేలికగా కొట్టిపడేసేది కాదంటున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది?స్థానికులు అంత ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు.. వాటిపై పరిశోధన చేసి, వివరాలను ప్రజలకు వివరించాలన్నారు.. అక్కడ డ్రోన్స్ ఎగిరాయా..? యూఎఫ్ఓలు కనిపించాయా నిగ్గు తేల్చాలన్నారు. ? అంతేకాదు… తాను కూడా తన నివాసప్రాంతమైన డేవిడ్ సన్ విల్లే దగ్గర రాత్రి 9.45 నిముషాల సమయంలో వీటిని చూశానని పోస్టు చేశారు కూడా. అయితే ఇలాంటివి ఎగిరినట్లు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎఫ్బీఐ(FBI), హోమ్ ల్యాండ్(Home land) సెక్యూరిటీ స్పష్టం చేశాయి.
ఈ వ్యవహారంలో ఫెడరల్ గవర్నమెంట్ తీరును హోగన్స్ తప్పుపట్టారు. ఏమీ జరగనట్లు అంత నిర్లిప్తంగా ఉండడం తగదన్నారు. అసలు ఏం జరుగుతుందో పూర్తి పారదర్శకంగా ప్రజలకు.. ప్రభుత్వం వివరించాలన్నారు.







