నోబెల్ శాంతి బహుమతికి జో బైడెన్ నామినేట్!
అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న వేళ డెమొక్రటిక్ అభ్యర్థి జో బైన్ నోబెల్ శాంతి బహుమతి 2021కి నామినేట్ అయ్యారు. బ్రిటన్ లేబర్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు క్రిస్ బ్రియాంట్.. జో బైడెన్ పేరును నామినేట్ చేశారు. ఈ సందర్భంగా ఇతరులు హింసాత్మక పరిష్కారాలను ఆశ్రింయిన వేళ, చర్చల ద్వారా సమస్యలను పరిష్కారించుకోవాలని జో బైడెన్ వాదించినట్లు ఆయన చెప్పారు. తుపాకులు, గుండె కొట్టుకోకుండా చేయగలవు. కానీ మంచి మాటలు ఎన్నో హృదయాలను మార్చగలవు. ఆ హృదయాలు ప్రపంచాన్నే మారుస్తాయి అని ఆయన వ్యాఖ్యానించారు.













