ఎపికి అన్యాయంపై గళమెత్తిన బే ఏరియా ఆంధ్రులు

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయంగా రావాల్సిన ప్రత్యేక హోదా, ఇతర సౌకర్యాల కల్పనలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బే ఏరియాలోని ఆంధ్రులు ఎపి డిమాండ్స్ జస్టిస్ నినాదంతో మార్చి 3వ తేదీన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మంచు వర్షం కురుస్తున్నప్పుటి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ బే ఏరియాలోని ఆంధ్రులు నిరసన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. వెంకట్ కోగంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ తెలుగు సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. వెంకట్ కోగంటితోపాటు సతీష్ వేమూరి, ప్రసాద్ మంగిన, యశ్వంత్ కుదరవల్లి, భక్తబల్లా, చంద్ర గుంటుపల్లి, రామ్ తోట తదితరులు పాల్గొన్నారు.