నవ్యాంధ్రకు ప్రవాసాంధ్రుల మద్దత్తు
కేంధ్రప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయానికి నిరసనగా అమెరికాలోని ప్రవాసాంధ్రులు “AP Demands justice” అనే నినాదంతో మార్చి 3 వ తారీఖున వివిధ నగరాలలో మౌన దీక్ష కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రవాసాంధ్రులు తోటి తెలుగు వారు, నవ్యాంధ్రకు మద్దత్తు నిచ్చే భారతీయులతో కలిసి ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనుటకు అమెరికా వారసత్వం కలిగిన తెలుగు వారూ కూడా ఉత్సాహం చూపుతున్నారు. ఈ మౌన దీక్ష నిరసన కార్యక్రమం అమెరికాలో 20 కి పైన ముఖ్య నగరాలలో నిర్వహిస్తున్నారు, వాటిలో కొన్ని నగరాలు …డల్లాస్, ఆస్టిన్, హూస్టన్, జర్సీ, చార్లెట్ట్, సియాటిల్, బే ఏరియా, అట్లాంటా, పోర్టలాండ్, హార్ట్ ఫోర్డ్, షికాగో, సెయింట్ లూయిస్, డెస్ మోయిన్స్, కొలంబస్, రిచ్ మాండ్, ఓమహా, ఫిలడెల్ఫియా, మేరీ లాండ్, బాల్టిమోర్. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడుటకు ప్రతి ప్రవాసాంధ్రుడు ఆత్మవిశ్వాసంతో మందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు. విభజన చట్టంలోని అంశాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసాలని ప్రవాసాంధ్రులు పిలుపు నిచ్చారు.













