ఘనంగా ఎఐఎ దసరా దీపావళి సంబరాలు

బే ఏరియాలో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఐఎ), బాలీ 92.3 ఆధ్వర్యంలో దసరా, దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. దాదాపు 30 సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. 30,000 మంది వేడుకలకు తరలివచ్చారు. సంజీవ్ గుప్తా సిపిఎ, ఫైర్‌వర్క్స్‌ను స్పాన్సర్ చేయడంతోపాటు వేడుకకు సమర్పకునిగా కూడా వ్యవహరించారు. గ్రాండ్ స్పాన్సర్‌గా డా. ప్రకాశ్ అద్వానీ ఫ్యామిలీ డెంటిస్ట్రీ (రావణ దహన కార్యక్రమ స్పాన్సర్), ప్లాటినం స్పాన్సర్లుగా InsuKare.com ఇన్‌స్యూరెన్స్ (రథయాత్ర స్పాన్సర్) నీరాజీకి చెందిన సంపూర్ణ వాస్తు (మహా మంగళ్‌హారతి స్పాన్సర్)వీరితోపాటు ఇన్‌క్లూడ్ అండ్ టీవి, ఫార్మర్స్ ఇన్‌స్యూరెన్స్, మంత్రి డెవలపర్స్, ఫ్లై ఏర్ ట్రావెల్స్, స్వదేశ్ ఇండియా బజార్ కూడా ఈ వేడుకలను స్పాన్సర్ చేశాయి.
వేడుకల్లో భాగంగా డ్యాన్స్ పోటీలు, దియా మేకింగ్, రంగోలి, ఫ్లాష్‌మోబ్, డిజె, రావణ్ దహన్, ఫైర్‌వర్క్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బాలీవుడ్, క్లాసికల్ డ్యాన్స్‌లు మరోవైపు ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. డిప్యూటీ కాన్సల్ జనరల్ రోహిత్ రతీష్, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి, భారత సుప్రీంకోర్ట్ జడ్జ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్, అసెంబ్లీ మెంబర్ కాన్‌సేన్ చు, మరో అసెంబ్లీ సభ్యుడు యాష్ కల్రా, కౌంటీ సూపర్‌వైజర్ దావే కర్టిస్, శాన్‌హోసె మేయర్ శామ్ లిక్కార్డో, కుపర్టినో మేయర్ సవితా వైద్యనాథన్, సౌత్ శాన్‌ఫ్రాన్సిస్కో మేయర్ డా. గుప్తా, ఫ్రీమాంట్ సిటీ మేయర్ లిలిమే, సిటీ కౌన్సిల్ మెంబర్ రాజ్ సల్వాన్, యుఎస్ కాంగ్రెస్ మెన్ ఆర్‌ఓ ఖన్నా ఆఫీస్ ప్రతినిధులు తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
వేడుకల్లో భాగంగా లక్ష్మీ రథం ముందు పలువురు భక్తులు పూజలు చేశారు. దేశీ ఫుడ్ ఫెస్టివల్‌లో భాగంగా వచ్చినవారికి వివిధ రుచులను అందించారు. స్వాగత్ ఇండియన్ కుజిన్, షాలిమార్ రెస్టారెంట్, ఛాట్ భవన్, నవాబీ హైదరాబాద్ హౌజ్, పీకాక్ ఇండియన్ కుజిన్, డబ్లిన్, కోస్తా-సౌత్ ఇండియన్ ఫుడ్ కార్నర్, ఈట్ అప్, అక్షయ ఇండియన్ కుజిన్ తదితర సంస్థలు ఇందులో తమ తమ వంటకాలను అందించాయి.
పాటలహోరుతో ఎక్స్‌పో సెంటర్ నిండిపోయింది. బాలీవుడ్ డ్యాన్స్‌లను ఎన్‌కెడి ఆర్ట్స్, మధురమైన పాటలను బాటా, ఎఐఎ కరవోకె గ్రూపులు పాడాయి.
చివరన ఈ వేడుకలను విజయవంతం చేసినవారందరికీ ఎఐఎ టీమ్ ధన్యవాదాలను తెలియజేసింది.