9 మంది ఐరాస సిబ్బందికి కరోనా
మహమ్మారి కరోనా ఐక్యరాజ్య సమితికీ పాకింది. జెనీవాలోని 9 మంది కార్యాలయ సిబ్బందికి కరోనా సోకినట్టు ఐక్యరాజ్య సమితి సమాచార డైరెక్టర్ అలెసాండ్రా వెలుసి తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ లేఖలో పేర్కొన్నట్టు జిన్హువా వార్త సంస్థ వెల్లడించింది. అయితే, ప్రస్తుత సమయంలో బాధితులకు సంబంధించిన వివరాలేవీ చెప్పబోమని ఆమె సృష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. స్థానిక స్విట్జర్లాండ్ ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి కోవిడ్ 19 పై పోరుకు పనిచేస్తామని తెలిపారు.













