అమెరికాలో 19వ ఆటా మహాసభలు.. జూలై 31 నుంచి బాల్టిమోర్‌లో వేడుకలు!
ATA: అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో 19వ ఆటా కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ‘మన సంస్కృతిపై మమకారం – మన ప్రజలపై కరుణ’ అనే నినాదంతో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
వేదిక , తేదీలు:
మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా 2026, జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మూడు రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది తెలుగు కుటుంబాలు ఒకే చోట చేరి మన సంస్కృతి, సంప్రదాయాలను జరుపుకోనున్నాయి.
విశేషాలు:
వినోదం: ప్రముఖ తారలతో సాంస్కృతిక ప్రదర్శనలు , స్టార్ స్టడెడ్ ఎంటర్టైన్మెంట్.
చర్చాగోష్టులు: బిజినెస్, మెడికల్, ఆధ్యాత్మిక సెమినార్లతో పాటు మహిళా, యువత కోసం ప్రత్యేక వేదికలు.
ప్రత్యేకతలు: గ్రాండ్ బాంక్వెట్, అవార్డుల నైట్, వెండర్ ఎగ్జిబిషన్లు , రకరకాల పోటీలు.
తెలుగు వారసత్వాన్ని, సంప్రదాయాలను చాటిచెప్పేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రెసిడెంట్ జయంతి చల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సతీష్ రామసహాయం రెడ్డి, మధు బొమ్మినేని, సాయినాథ్ బోయపల్లి, శ్రీకాంత్ గుడిపాటి, శారద సింగిరెడ్డి, విజయ్ తుపాళ్ళ, నర్సిరెడ్డి గడ్డికొప్పుల, అరవింద్ రెడ్డి ముప్పిడి తదితరులు పాల్గొంటున్నారు.
మరిన్ని వివరాల కోసం www.americanteluguassociation.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.






