Samantha: జోయాలుక్కాస్ ప్రచారకర్తగా సమంత

సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కొన్నాళ్లుగా పర్సనల్ రీజన్స్ వల్ల సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో కంబ్యాక్ ఇవ్వాలని వరుస సినిమాలను, వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సమంత కేవలం నటిగా మాత్రమే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా రాణిస్తుంది. ఇప్పటికే సమంతకు సాకి(Saaki) అనే ఫ్యాషన్ బ్రాండ్ తో పాటూ ఓ లగ్జరీ పెర్ఫ్యూమ్ లైన్, ఏకాం(Ekam) అనే స్కూల్ బ్రాండ్స్ ఉన్నాయి.
ఇంత బిజీగా ఉన్నప్పటికీ సమంత ఇప్పుడు తాజాగా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా బాధ్యతలు చేపట్టింది. ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్(Joyalukkas) కు సమంత ప్రచారకర్తగా వ్యవహరించనుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో తమ డిజైన్లు, క్వాలిటీని సమంత తనదైన రీతిలో ఇంట్రడ్యూస్ చేస్తారని సంస్థ చైర్మన్ జాయ్ ఆలుక్కాస్(JOY ALUKKAS) చెప్పగా, ప్రతి మహిళను ఆత్మవిశ్వాసంతో ప్రకాశించేలా ప్రోత్సహించే జోయాలుక్కాస్ తో కలిసి వర్క్ చేయడం మరింత ఆనందాన్నిస్తుందని సమంత చెప్పింది.
ఫ్యాషన్, లగ్జరీలో మంచి పట్టు ఉన్న సమంత.. దాన్ని మరింత పెంచుకోవడానికి ఈ డీల్ ఎంతో ఉపయోగపడనుంది. బాలీవుడ్ నటి కాజోల్(Kajol) ఇప్పటికే జోయాలుక్కాస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా, ఇప్పట్నుంచి సమంత కూడా ఆమెతో కలిసి జోయాలుక్కాస్ ను ప్రమోట్ చేయనుంది. కొన్నాళ్లుగా కెరీర్ విషయంలో నెమ్మదిగా వ్యవహరించిన సమంత ఇక స్పీడప్ చేయాలని డిసైడ్ అయి అందులో భాగంగానే జోష్ ను పెంచిందని ఆమె ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.