రీ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ నగరానికి ఏమైంది….
టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ హవా కొనసాగుతుంది. ఒకప్పటి బ్లాక్ బస్టర్ సినిమాలని ఫాన్స్ కోసం బిగ్ స్క్రీన్ పై ప్రదర్శిస్తున్నారు. ఈ రీ రిలీజ్ సినిమాల్లో చాలా వరకు ఫ్యాన్స్ షోస్ అని చెప్పాలి. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, తమ్ముడు సినిమాలకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. తరువాత బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి మూవీ కూడా రీరిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి, ఒక్కడు సినిమాలని రీరిలీజ్ చేసి ప్రేక్షకులకి వినోదాన్ని అందించారు.
రీసెంట్ గా రీ రిలీజైన పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా రీ రిలీజ్ లో ఏకంగా 4 కోట్ల వరకు కలెక్ట్ చేయడం విశేషం. ఈ జనరేషన్ సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ బాట పడుతున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “ఈ నగరానికి ఏమైంది?”. ఈ సినిమా ప్రస్తుతం రీరిలీజ్ కి రెడీ అవుతుంది.
నాలుగేళ్ల క్రితం ఈ సినిమా రిలీజ్ అవ్వగా, తరుణ్ భాస్కర్ మొదటి సినిమా పెళ్లి చూపులు రేంజ్ లో ఆదరణ సొంతం చేసుకోలేదు. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తో కలెక్షన్స్ ని రాబట్టింది. అయితే మళ్ళీ ఎందుకో ఈ మూవీని థియేటర్స్ లో రీరిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటుందా? స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చేలా చేస్తుందా అనేది చూడాలి.













