సింగర్ సునీత మరో షాక్!
సింగర్ సునీత తన రెండో పెళ్లి తర్వాత తరచు వార్తలలో నిలుస్తూ వస్తుంది. గత ఏడాది నవంబర్‌లో బిజినెస్మెన్ రామ్‌తో నిశ్చితార్ధం జరుపుకున్న సునీత జనవరిలో అతనితో కలిసి ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత సునీత ఏదో ఒక టాపిక్‌తో తరచు హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. తాజాగా కల్లు గ్లాసు పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చి నిలిచింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన సునీత అక్కడ తన కో యాంకర్ గాయత్రి భార్గవితో కలిసి కల్లు గ్లాస్ పట్టుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. వీరితో పాటు గీతా కార్మికుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.













