పుష్ప2పై అంచనాలను పెంచుతున్న సుకుమార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప2. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతీసారీ ఏదొక విషయంలో వార్తల్లోకెక్కుతుంది పుష్ప2 సినిమా. తాజాగా మరోసారి ఈ సినిమా నెట్టింట సందడి చేస్తోంది. పుష్ప2 లో ఓ కీలకమైన పాత్రకు గానూ బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ను సంప్రదించారట చిత్ర యూనిట్.
సినిమాలో ఆయన పాత్ర ఉండేది కేవలం 7 నుంచి 10 నిమిషాలే. అయినా సరే బాగా కీలకమైన పాత్ర కావడంతో ఆ పాత్ర కోసం సంజయ్ దత్ ను రంగంలోకి దించుతున్నాడట సుకుమార్. ఇన్ సైడ్ టాక్ ప్రకారం, ఇప్పటికే సంజయ్ దత్ తో డిస్కషన్స్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో బిజినెస్ చేయాలని లక్ష్యంతో సుకుమార్ దీన్ని రూపొందిస్తున్నాడు.
సంజయ్ దత్ నటిస్తే బిజినెస్ పరంగా కూడా కలిసొస్తుందని, బాలీవుడ్ లో కూడా సంజయ్ దత్ ఉంటే సినిమాకు క్రేజ్ తో పాటూ ప్రీ రిలీజ్ బజ్ కూడా పెరుగుతుందని, వీటన్నింటినీ మైండ్ లో పెట్టుకునే సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి సుకుమార్ సినిమాపై మెల్లిగా అంచనాలను ఆకాశాన్నంటిస్తున్నాడు.













