భారమంతా సమంత పైనే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు(samantha ruth prabhu) గత కొన్నేళ్లుగా బాలీవుడ్, ఓటీటీ ప్రాజెక్ట్‌లతో బిజీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె నటించిన తాజా తెలుగు సినిమా మా ఇంటి బంగారం(maa inti bangaram)పై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. నందినీ రెడ్డి(nandini reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 15న విడుదలకు సిద్ధమవుతుండగా, ఇప్పటివరకు మాత్రం సినిమాకు అనుకున్న స్థాయిలో బజ్ రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సమంత స్వయంగా ప్రమోషన్స్‌ను ప్రారంభించి సినిమాపై దృష్టి సారించడం విశేషంగా మారింది. ముఖ్యంగా ఈ సినిమాకు ట్రైలర్ కీలకంగా మారనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
మహిళా ప్రధాన కథతో తెరకెక్కిన ఈ సినిమాకు సమంతనే ప్రధాన బలం కావడంతో, ప్రమోషన్స్‌లో ఆమె పాత్ర మరింత కీలకంగా మారింది. ట్రైలర్ కట్ ఆకట్టుకునే విధంగా ఉంటేనే ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాకు కథను సమంత భర్త రాజ్ నిడిమోరు(Raj nidimoru) అందించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. కంటెంట్ పరంగా కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
సమంత సొంత బ్యానర్ ట్రాలాలా పిక్చర్స్(Tralala pictures) నిర్మించిన ఈ సినిమాకు ఇప్పటికే నాన్ థియేట్రికల్ హక్కులు క్లోజ్ అయినట్లు సమాచారం. థియేట్రికల్ రిలీజ్‌ను సురేష్ ప్రొడక్షన్స్(Suresh productions) నిర్వహిస్తుండటం సినిమాకు అదనపు బలం ఇచ్చే అంశంగా మారింది. ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య(Gulshan devaiah), గౌతమి(Gauthami) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తం మీద మా ఇంటి బంగారం రిలీజ్ కు ముందు బజ్ పెంచడం సమంత ముందున్న ప్రధాన సవాల్‌గా మారింది.








