Samantha: సక్సెస్ అంటే కేవలం విజయాలు మాత్రమే కాదంటున్న సమంత
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం నార్త్ లో బిజీ అయిపోయింది. రీసెంట్ గా సిడ్నీలో పర్యటించిన సమంత అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొని తన కెరీర్ గురించి మాట్లాడటంతో పాటూ సక్సెస్ కు కొత్త అర్థాన్ని పరిచయం చేసింది. సక్సెస్ అవడమంటే విజయాలు సాధించడం మాత్రమే కాదని, స్వేచ్ఛగా జీవించడమని సమంత పేర్కొంది.
మన లైఫ్ మనకు నచ్చినట్టు బతకడమే సక్సెస్ అని, నిజ జీవితంలో ఎన్నో రకాల పాత్రలను చేస్తూ వాటిని సరిగ్గా ముందుకు తీసుకెళ్లడమే అసలైన సక్సెస్ అని సమంత చెప్పింది. యూత్ తో మాట్లాడుతూ తన డ్రీమ్స్ లో ఒకటి ఇప్పటికీ నెరవేరలేదని సమంత తెలిపింది. చదువుకునే రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్లి, సిడ్నీ యూనివర్సిటీలో చదువుకోవాలని అనుకున్నానని, కానీ ఆ కోరిక తీరలేదని చెప్పింది.
అనుకోకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తాను, హీరోయిన్ గా ఇంతమంది ప్రేమను, అభిమానాన్ని పొందడం ఎంతో ఆనందాన్నిస్తుందని సమంత తెలిపింది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ, ప్రేక్షకులకు మంచి సినిమాలను అందించడానికే తాను నిర్మాతగా మారానని చెప్పిన సమంత ప్రస్తుతం తాను రక్త బ్రహ్మాండ్(Raktha Brahmand) లో నటిస్తున్నానని తెలిపింది.













