నిరీక్షణ ఎవరికోసం ?
సాయిరోనక్, ఎనా సహా జంటగా టేక్ ఓకే క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వంలో పి.రాజన్ నిర్మిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ నిరీక్షణ. ఈ చిత్రంలో మొదటిసారి ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి తనయుడు, హీరో జీవా సోదరుడు రమేష్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీపావళి పర్వదినం సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు ప్రమోషన్ల్ సాంగ్ రాక్షస.. విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా రోల్ రిడా గానం చేశారు. సాయి రోనక్, ఎనా సహా జంటగా నటిస్తున్న ఈ సినిమా రమేష్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. శ్రద్దా దాస్, సన్స్పెషనల్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, మధుసూధన్, వేణు, హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.













