కుటుంబ వేడుకగా…నీహారిక నిశ్చితార్ధం…
మెగా బ్రదర్స్‌లో ఒకరైన నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్ధం చడీ చప్పుడు లేకుండా జరిగిపోయియింది. ఇటీవలే గుంటూరు ఐజీ రేంజ్ కొడుకు చైతన్య తో నిహారిక పెళ్లి నిర్ణయించిన విషయం తెలిసిందే. నీహారిక తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తాను పెళ్లి చేసుకునే వాడు అంటూ తన వుడ్ బీని పరిచయం చేసింది. అయితే ఇది పూర్తిగా పెద్దలు కుదర్చిన వివాహం. డిసెంబర్ లో వివాహం జరుగబోతుందని కూడా నాగబాబు ఇప్పటికే తెలియజేశారు.
ఈ నేపధ్యంలో నేడో రేపో ఎంగేజ్మెంట్ జరుగుతుందని అందరూ ఊహించిందే అయినా… ఇంత నిశ్శబ్ధంగా ఎవరికీ సమాచారం లేకుండా జరుగుతందని మాత్రం అనుకోలేదు. పూర్తి కుటుంబ వేడుకగా జరిపిన ఈ నిశ్చితార్ధానికి సతీ సమేతంగా మెగా స్టార్ చిరంజీవితో పాటు హీరోలు అల్లుఅర్జున్, సాయిధరమ్ తేజ్, రాంచరణ్, ఇలా కేవలం మెగా ఫ్యామిలీ కి చెందిన హీరోలు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మెగా అభిమానులకు కనుల పండుగ కలిగించే ఈ వేడుక వీడియోలను గురువారం రాత్రి సోషల్ మీడియాకు విడుదల చేశారు.













