ఆ బాధ్యత మనందరిపై ఉంది
తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభంపై నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) స్పందించిన తీరు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎలాంటి మొహమాటాలు లేకుండా తన అభిప్రాయాలను వెల్లడించే బాలకృష్ణ, ఈసారి కూడా థియేటర్ల పరిస్థితి, నిర్మాతల ఇబ్బందులు, పర్సంటేజ్ విధానం వివాదంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, తెలుగు సినిమాను ఈ సంక్షోభం నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మనందరిదీ. ప్రతి హీరో మరిన్ని సినిమాలు చేయాలి. ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి సందేశం ఇచ్చే సినిమాలు రావాలంటూ పిలుపునిచ్చారు.
ఇప్పటి టెక్నాలజీ పెరిగినా సినిమాల నిర్మాణం ఆలస్యమవుతుండటంపై కూడా బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో టెక్నాలజీ లేకపోయినా సినిమాలు టైమ్ కు పూర్తయ్యేవని, ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నా సినిమాలు లేటవుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. మూతపడుతున్న థియేటర్లను కాపాడాలంటే స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న పర్సెంటేజ్ సిస్టమ్ వివాదాన్ని మొత్తం ఇండస్ట్రీ గమనిస్తోందని, త్వరలోనే సమస్యకు పరిష్కారం దొరకాలని ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో వచ్చే భారీ విడుదలగా పెద్ది(Peddi) నిలవనుంది. రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుండగా, విడుదలకు ముందు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం NBK111 షూటింగ్లో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత, కొరటాల శివ(Koratala Siva)తో మరో భారీ ప్రాజెక్ట్ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించేందుకు బాలయ్య సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి







