Janhvi Kapoor : జాన్వీకపూర్ కు బిర్లా వారసురాలు అనన్య ఖరీదైన కానుక
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor)ను బిర్లా వారసురాలు అనన్య (Ananya) సర్ప్రైజ్ చేశారు. 5 కోట్ల విలువ చేసే లంబోర్గిని కారును కానుకగా పంపించారు. పర్పుల్ కలర్ లంబోర్గిని కారు (Lamborghini car)ను జాన్వీ నివాసానికి పంపించారు. ఈ కారుతో పాటు మరో గిఫ్ట్‌ను సైతం అందులో ఉంచారు. ఆ గిఫ్ట్ ప్యాక్‌పై ప్రేమతో నీ అనన్య అని రాసి ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా (Kumar Mangalam Birla) కుమార్తె అనన్య. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ (Aditya Birla Fashion) అండ్ రిటైల్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్లలో ఒకరిగా ఆమె వ్యవహరిస్తున్నారు. 17 ఏళ్ల వయసులోనే స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన మొదటి సంస్థను స్థాపించారు. భారత్‌లోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మైక్రోఫైనాన్స్ సంస్థల్లో ఇది కూడా ఒకటి. గాయనిగా కూడా ఆమె సుపరిచితురాలు. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కోసం ఆమె వర్క్ చేశారు. అనన్య-జాన్వీ ఎంతోకాలంగా స్నేహితులు. అనన్య ఇటీవల సౌందర్య ఉత్పత్తుల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. దీనికి జాన్వీకపూర్ బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador )గా వ్యవహరించనున్నట్లు సమాచారం. తన బ్రాండ్ కోసం వర్క్ చేస్తున్నదుకు కానుకగా అనన్య ఈ ఖరీదైన కానుకను ఆమెకు పంపించారని ప్రచారం జరుగుతుంది.













