సమంతను మెప్పించాలంటే డైరెక్టర్లు కూడా లెవెల్ పెంచుకోవాల్సిందే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) చాలా గ్యాప్ తర్వాత పూర్తి స్థాయి తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో మా ఇంటి బంగారం(Maa Inti Bangaram)పై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఫీల్‌గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందినీ రెడ్డి(Nandini Reddy) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కథను రాజ్ నిడిమోరు(Raj Nidimoru) అందించడం మరింత హైప్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్(Tralala Moving Pictures) బ్యానర్‌పై సమంత స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ప్రోమో కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచగా, జూన్ 19 విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది.
ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నందినీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత వర్క్ కమిట్మెంట్ గురించి మాట్లాడిన ఆమె, సమంతను కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదని, ఒక సీన్ అయినా, డైలాగ్ అయినా, స్క్రిప్ట్‌లోని ప్రతి అంశంపైనా ఆమెకు పూర్తి క్లారిటీ కావాలి. దర్శకుడు తన గేమ్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాల్సిందేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కాంబినేషన్లో ఇది మూడో సినిమా అని గుర్తుచేసిన నందినీ రెడ్డి, యాక్షన్, కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు.. ఏ జానర్ అయినా సమంత తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని ప్రశంసించారు.
ఈ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో సమంత ఫ్యాన్స్ భారీగా స్పందిస్తున్నారు. పాత్రల విషయంలో సమంత చూపించే డెడికేషన్‌కు ఇదే నిదర్శనమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మా ఇంటి బంగారంలో సమంత పాత్ర ఆమె కెరీర్లో ఇప్పటివరకు కనిపించని కొత్త ఎమోషనల్ షేడ్స్‌తో ఉండబోతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నందినీ రెడ్డి, సమంత మధ్య ఉన్న అండర్స్టాండింగ్ సినిమాకు పెద్ద బలం అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్‌ను చూస్తుంటే, ఈ సినిమా జస్ట్ సమంత కంబ్యాక్ మూవీగానే కాకుండా ఆమె కెరీర్లో మరో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.







