భీష్మ ఫస్ట్ లుక్
నితిన్, రష్మిక మండన, వెంకీ కుడుముల కాంబినేషన్లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న చిత్రం భీష్మ. ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను దీపావళి పర్వదినాన విడుదల చేశారు. నితిన్, రష్మికల రొమాంటిక్ టచ్‌తో కూడిన ప్రచార చిత్రం ఒకటి ఐతే, మరొకటి నితిన్ పోరాట సన్నివేశంతో కూడినది. ఈ ప్రచార చిత్రాలకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత సూర్యదేవర నాగ వంశి తెలిపారు.













