బట్టల రామస్వామి బయోపిక్ ఫస్ట్ లుక్
అల్తాఫ్, శాంతిరావు, లావణ్యారెడ్డి, సాత్వికజైన్ హీరో హీరోయిన్లుగా రామ్‌నారాయణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం బట్టల రామస్వామి బయోపిక్. సతీష్‌కుమార్ ఐ నిర్మాత. ఇటీవల ప్రారంభమైన షూటింగ్లో సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. కొత్త టాలెంట్‌ను ప్రొత్సహించడం కోసం ఈ సినిమా తీస్తున్నాం. కమర్షియల్ అంశాలతో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. వచ్చే వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు: వాసుదేవమూర్తి, సంగీత, దర్శకత్వం: రామ్‌నారాయణ్.













