కామెడీ డైరెక్టర్ తో నితిన్ సినిమా
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) కెరీర్ ప్రస్తుతం కీలక దశలోకి అడుగుపెడుతోంది. వరుస పరాజయాల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) నిర్మాణంలో ఓ కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన ఆయన, ఈ ఏడాదిలోనే ఆ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కథల ఎంపికలో కూడా నితిన్ పూర్తిగా కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక తాజాగా నితిన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అనుదీప్ కేవీ(Anudeep KV) దర్శకత్వంలో ఓ ఫుల్ లెంగ్త్ హిలేరియస్ ఎంటర్టైనర్ తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. జాతిరత్నాలు(Jathi ratnalu) తరహాలో వినోదానికి పెద్దపీట వేస్తూ ఈ కథను అనుదీప్ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా, ఇప్పటికే స్టోరీ ఐడియా విన్న నితిన్ పూర్తి కథను సిద్ధం చేయాలని దర్శకుడికి సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్(TG Viswaprasad) నిర్మించనున్నారు.
మరోవైపు ఆయ్(Aay) డైరెక్టర్ అంజి(Anji)తో కూడా నితిన్ ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. అలాగే డైరెక్టర్ వీఐ ఆనంద్(VI Anand)తో భారీ బడ్జెట్ సినిమా అనౌన్స్ అయినప్పటికీ, ప్రస్తుతం నాన్ థియేట్రికల్ మార్కెట్ మందగమనంతో ఆ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడినట్లు తెలుస్తోంది. దీంతో నితిన్ తన ఫోకస్‌ను ఇతర ప్రాజెక్టులపై మళ్లించినట్లు సమాచారం. గతంలో వచ్చిన రాబిన్ హుడ్(Robinhood), తమ్ముడు(Thammudu)ni సినిమాలు భారీ నిరాశ కలిగించడంతో, ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయాలు కెరీర్‌కు కీలకంగా మారనున్నాయి.








