ఆదిత్య బిర్లా కంపెనీ సరికొత్త ప్లాన్.. యూత్ కోసమే ప్రత్యేక హెల్త్ పాలసీ
Activ Youth:ప్రస్తుతం యువత మారుతున్న జీవనశైలి, ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక సరికొత్త రక్షణ కవచాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘యాక్టివ్ యువ’ (Activ Youth) పేరుతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కేవలం హాస్పిటల్ ఖర్చులకే పరిమితం కాకుండా, వినియోగదారుల రోజువారీ హెల్తీ లైఫ్‌స్టైల్‌ను ప్రోత్సహించేలా రూపొందించినట్లు కంపెనీ సీఈఓ మయాంక్ బత్వాల్ వెల్లడించారు. రోజూ ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించే వారికి ‘హెల్త్ రిటర్న్స్’ పేరుతో ప్రత్యేక రివార్డులను అందించడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం.
ఈట్, మూవ్, హీల్ (Eat, Move, Heal) సూత్రాలు..
ఈ పాలసీ ప్రధానంగా మూడు సూత్రాల ఆధారంగా లబ్ధిదారులకు రివార్డులను అందిస్తుంది.
ఈట్ (Eat): ఒక నెలలో 21 రోజుల పాటు, రోజుకు రెండు పూటల భోజన వివరాలను కంపెనీ యాప్‌లో నమోదు చేస్తే 10 శాతం హెల్త్ రిటర్న్స్ లభిస్తాయి.
మూవ్ (Move): నెలకు సగటున 7,500 అడుగులు నడిచినా లేదా 250 కేలరీల శక్తిని ఖర్చు చేసినా ప్రతి నెలా 4 బోనస్ యాక్టివ్ డేస్ లభిస్తాయి.
హీల్ (Heal): ఒక నెలలో 21 రోజుల పాటు క్రమం తప్పకుండా రోజుకు 7 నుండి 8 గంటల నిద్రపోతే మరో 15 శాతం వరకు అదనపు హెల్త్ రిటర్న్స్ పొందవచ్చు.
100 శాతం ప్రీమియం వెనక్కి..
రోజువారీ జీవనశైలిలో భాగంగా ప్రతిరోజూ 10 వేల అడుగులు నడవడం లేదా సరైన వ్యాయామం ద్వారా 300 కేలరీలు ఖర్చు చేయడం ద్వారా వినియోగదారులు తాము చెల్లించిన వార్షిక ప్రీమియం మొత్తాన్ని 100 శాతం తిరిగి పొందే అద్భుతమైన అవకాశాన్ని ఈ ప్లాన్ కల్పిస్తోంది.
మరికొన్ని కీలక ప్రయోజనాలు..
యువతకు ఆర్థిక భరోసాతో పాటు పూర్తి రక్షణ కల్పించేలా ఈ ప్లాన్‌లో పలు ఆకర్షణీయమైన ఫీచర్లను చేర్చారు. ఇందులో అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్ సౌకర్యంతో పాటు, ‘యువ క్రెడిట్’ ద్వారా 11 ఏళ్లలో పాలసీ మొత్తం 11 రెట్లు పెరిగే అవకాశం ఉంది. వీటితో పాటు ఉచిత డాక్టర్ సంప్రదింపులు (Doctor Consultations), ఓపీడీ కవరేజ్ (OPD Cover), ,ఇన్‌కం ప్రొటెక్షన్ వంటి మరెన్నో ఆధునిక బెనిఫిట్స్ ఈ ప్లాన్ ద్వారా లభిస్తాయి.







