ఫేక్ యాప్స్ తో జాగ్రత్త … సీపీ సజ్జనార్ హెచ్చరిక
మే 22న ఉప్పల్ వేదికగా జరగనున్న ఎస్ ఆర్ హెచ్ (SRH), ఆర్ సిబి (RCB) మ్యాచ్ కు ఉన్న క్రేజ్ ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ (CP Sajjanar) హెచ్చరించారు. సోషల్ మీడియా (Social Media) వేదికగా ఐపీఎల్ టికెట్ల (IPL tickets) బుకింగ్ కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన డిస్ట్రిక్ట్ యాప్ ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్ లను సృష్టించి, తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారు. ఫేక్ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త. మ్యాచ్ చూడాలనే ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చే అనధికార లింకులను నమ్మి మోసపోవద్దు. ఇలాంటి ఫేక్ యాప్స్, వెబ్ సైట్ల పై నిఘా ఉంచాం. ఎవరికైనా ఇలాంటి యాప్స్, వెబ్ సైట్ల గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని సజ్జనార్ పేర్కొన్నారు.







