సూర్యుని వెలుతురిలో మెరిసిపోతున్న సిమ్రాన్
ఈ నగరానికి ఏమైంది(Ee Nagaraniki Emaindhi) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ చౌదరి(Simran Chaudhary) మొదటి సినిమాతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తర్వాత సెహరి(Sehari) లాంటి సినిమాల్లో నటించి మంచి ప్రశంసలందుకున్న సిమ్రాన్, ఓ వైపు నటిగా కెరీర్లో ముందుకెళ్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా బ్లష్ పింక్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అమ్మడు ఎంతో అందంగా కనిపించింది. ఈ డ్రెస్ లో సిమ్రాన్ చాలా సింపుల్, ఎలిగెంట్ గా కనిపిస్తూ తన అందాల్ని ఆరబోయగా, వాటిని వైరల్ చేసే పనిలో కుర్రాళ్లు బిజీ అయిపోయారు.







