వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే విద్యాసంస్థలు తెరవడానికి వీలు లేదు: న్యూయార్క్ మేయర్

సెప్టెంబర్ 10 నుంచి న్యూ యార్క్ పబ్లిక్ స్కూల్స్ లో ఇన్-క్లాస్ తరగతులు తిరిగి ప్రారంభం కానుండటం తో నగర మేయర్ మంగళవారం 25 ఆగస్టు న నగర ఇన్స్పెక్టర్లు ప్రతి తరగతి గదిని సెప్టెంబర్ 1 లోపు సందర్శించి నిబంధనల ప్రకారం వెంటిలేషన్ లేని విద్యాసంస్థలకు తిరిగి తెరిచే అనుమతి రద్దు చెయ్యాలి అని ఆదేశించారు.
న్యూయార్క్ నగరం ప్రభుత్వ విద్యాసంస్థల భవనాల్లో పేలవమైన వెంటిలేషన్ మెరుగుపరచడం కోసం విద్యాసంస్థల లోని నర్సుల కార్యాలయాలు, ఐసోలేషన్ గదులు మరియు ఇతర అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో 10,000 పోర్టబుల్ ఎయిర్ ఫిల్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
సెప్టెంబర్ 10 న హైబ్రిడ్ మోడల్‌లో తరగతులు ప్రారంభం కావడానికి ముందే అన్ని విద్యాసంస్థల వెంటిలేషన్ వ్యవస్థలను నవీకరించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి.కానీ చాలా మంది ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు సెప్టెంబర్ 10 నాటికి భవనాలు సిద్ధంగా ఉంటాయని తాము నమ్మడం లేదని, వ్యక్తిగత తరగతులు తిరిగి తెరిచే ప్రక్రియను కొన్ని వారాల వెనక్కి తీసుకురావాలని మేయర్‌ను కోరినట్లు తెలిసింది.