ప్రపంచానికి భారత అమెరికన్ల పిలుపు…

భారత్ పట్ల చైనా దుందుడుకు వైఖరిని వ్యతిరేకిస్తూ అమెరికాలో భారతీయులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని భారత్ మాతాకీ జై, చైనా వస్తువుల్ని బహిష్కరించాలి, చైనా దుందుడుకు వైఖరిని అడ్డుకోవాలి అంటూ నినాదాలు చేశారు. చైనాను ప్రపంచ దేశాలు ఆర్థికంగా నిషేధించాలని, దౌత్యపరంగా ఒంటరి చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో న్యూయార్క్, న్యూజెర్సీల్లో ఉన్న భారతీయులు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ (ఎఫ్‍ఐఏ) సభ్యులు పాల్గొన్నారు. టిబెట్, తైవాన్‍కు చెందిన ప్రవాసులు కూడా వీరికి జత కలవడం విశేషం. జైపూర్ పుట్ యూఎస్‍ఏ సంస్థ చైర్మన్, సామాజిక కార్యకర్త ప్రేమ్ భండారీ, అమెరికన్ ఇండియా ప్రజావ్యవహారాల కమిటీ అధ్యక్షుడు జగదీశ్ సెవ్‍హానీ ఈ నిరసనలకు నేతృత్వం వహించారు. టిబెట్, తైవావ్ ప్రవాసులు సైతం భారత్ పట్ల చైనా తీరును ఖండించారు.