బోర్డింగ్ పాస్‌కు స్వస్తి!
విమానాశ్రయాల్లో బోర్డింగ్ పాస్ విధానానికి స్వస్తి పలకాలని విమానయాన భద్రతా ఏజెన్సీలు భావిస్తున్నాయి. బోర్డింగ్ పాస్‌ల స్థానంలో బయోమెట్రిక్‌తో కూడిన ఎక్స్‌ప్రెస్ చెక్ ఇన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. దీని వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయని, వారి ప్రయాణం సాఫీగా సాగుతుందని చెపుతున్నాయి. ఇటీవల దేశంలోని 17 ఎయిర్ పోర్ట్ల్లో హ్యాండ్‌బ్యాగేజ్ ట్యాగ్ల విధానానికి విమానయాన భద్రతా ఏజెన్సీలు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. దేశంలోని 59 విమానాశ్రయాల్లో బోర్డింగ్ కార్డు రహిత విధానాన్ని అమలులోకి తేవాలని యోచిస్తున్నామని, ఇందు కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నామని, ఇప్పుటిటకే ఈ ప్రక్రియ మొదలైందని విమానయాన భద్రత ఏజెన్సీ అయిన సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ వెల్లడించారు.













