Governors: తెలంగాణకు కొత్త గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా!
దేశవ్యాప్తంగా గవర్నర్ల (Governors) నియామకాలు, బదిలీల విషయంలో రాష్ట్రపతి భవన్ గురువారం కీలక ప్రకటన చేసింది. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించగా, మరికొందరిని బదిలీ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా కొత్త గవర్నర్‌ను నియమించారు.
తెలంగాణకు శివ్‌ప్రతాప్ శుక్లా..
ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా (Governors) బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసిన కేంద్రం.. ఆయన స్థానంలో ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న సీనియర్ నేత శివ్‌ప్రతాప్ శుక్లాను తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమించింది. మరికొన్ని రాష్ట్రాల గవర్నర్ల నియామకాలు ఇలా ఉన్నాయి:
ఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)గా తరణ్‌జీత్ సింగ్ సంధూ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ బాధ్యతల్లో ఉన్న వినయ్ కుమార్ సక్సేనాను లద్దాఖ్ ఎల్జీగా పంపించారు.
బీహార్, నాగాలాండ్: నాగాలాండ్ గవర్నర్‌గా (Governors) నంద కిశోర్ యాదవ్, బీహార్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ ఆతా హస్నయిన్ ఎంపికయ్యారు.
తమిళనాడు, హిమాచల్: లద్దాఖ్ ఎల్జీగా పనిచేసిన కవీందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు తమిళనాడు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇవి కూడా చదవండి
బెంగాల్ గవర్నర్ రాజీనామా.. మమత ఫైర్..
పశ్చిమ బెంగాల్ గవర్నర్ (Governors) సీవీ ఆనంద బోస్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. గురువారం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను అందజేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం రాజకీయంగా సంచలనంగా మారింది. ఆనంద బోస్ స్థానంలో.. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని బెంగాల్‌కు పంపించారు. బోస్ రాజీనామాపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర హోం శాఖ ఒత్తిడి తెచ్చి ఆయన చేత రాజీనామా చేయించి ఉంటుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కనీస సంప్రదింపులు జరపకుండానే కొత్త గవర్నర్‌ను (Governors) నియమించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని ఆమె కేంద్రంపై మండిపడ్డారు.
తొమ్మిది నెలలకే లద్దాఖ్ ఎల్జీ గుడ్‌బై..
మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ ఎల్జీ కవీందర్ గుప్తా కూడా బాధ్యతలు చేపట్టిన కేవలం 9 నెలలకే అనూహ్యంగా రాజీనామా చేశారు. లద్దాఖ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ రక్షణల కల్పన కోరుతూ స్థానికంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆయన్ను హిమాచల్ ప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమించారు.
ఇవి కూడా చదవండి








