లండన్ లో మహాత్ముని విగ్రహం మనందరికీ గర్వకారణం
మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం పార్లమెంట్ ఆవరణలో ఉండడం మనందరికీ గర్వకారణమని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. లండన్‌లో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లండన్ నడి బొడ్డున గాంధీ విగ్రహం నెలకొల్పడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొట్టిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని అదే బ్రిటిష్ దేశ పార్లమెంట్ ఎదురుగా ఏర్పాటు చేయడం నిజంగా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఎండీ మనోహర్ తదితరులున్నారు.













