కాంగ్రెస్ ఆ తప్పిదం చేయొద్దు : ఈటల
ఆర్టీసీతో పెట్టుకున్నోళ్లు బాగుపడిన దాఖలాలు లేవు అని ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆర్టీసీ ఐకాస చైర్మన్ ఈదురు వెంకన్న (Eeduru Venkanna) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఎంపీ ఈటల రాజేందర్, బీసీ ఐకాస చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) కలిసి మద్దతు ప్రకటించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేసీఆర్ (KCR) పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదం చేయొద్దు. తక్షణమే ఐకాస ప్రతినిధులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలి అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పోషించిన పాత్ర తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోదన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
2023లో ఆనాటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవోను విడుదల చేసింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారని భావించారు. అది జరగకపోవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాటపట్టారు అని అన్నారు. రెండు పీఆర్సీలను వెంటనే విడుదల చేయాలి. ఆనాడు కేసీఆర్ కూడా సంఘాలు ఎందుకు? సమ్మెలు ఎందుకు? అని ఆర్టీసీ గురించి మాట్లాడారు. ఆనాడు కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అదే పని చేస్తోంది అని అన్నారు.
ఇవి కూడా చదవండి








